Fasting: మతం మత్తులో చిన్నారి చిత్తు.. ఆకలితో మూడేళ్ల పాపను చం*పేసిన తల్లిదండ్రులు
Fasting: కానీ ఈ విషయంపై సున్నితమైన మతసంబంధ నిబంధనలు, చిన్నారుల హక్కులు, శిశుసంరక్షణ చట్టాల కణం కదిలేలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Fasting: మతం మత్తులో చిన్నారి చిత్తు.. ఆకలితో మూడేళ్ల పాపను చం*పేసిన తల్లిదండ్రులు
Fasting: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో మూడేళ్ల చిన్నారి వియానా జైన్ మృతిచెందిన ఘటన జైన సంప్రదాయంతో కలిపి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఈ చిన్నారికి, మతపరమైన అనుసరణగా జైన్ ముని సూచన మేరకు సంతారా ఆచారాన్ని చేపట్టడం, చివరికి మరణానికి దారి తీసిన తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. సంతారా లేదా సల్లేఖన అనేది జైన సంప్రదాయంలోని ఒక ఆచారం, ఇందులో శరీరం, జీవితం పట్ల అనురాగాన్ని వదిలేసే ప్రయత్నంగా శాంతంగా ఆహారాన్ని, నీటిని మానేస్తారు. ఇది సాధారణంగా జీవితాంతం సేవ చేసిన వారే చేపడతారు. కానీ ఈ చిన్నారి విషయంలో ఇదే ఆచారాన్ని ఉపయోగించడం, అది కూడా తల్లిదండ్రుల అంగీకారంతో జరిగిందన్న అంశం సామాజిక, నైతిక, చట్టపరంగా కలకలం రేపింది.
వియానాకు జనవరిలో బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ కాగా, శస్త్రచికిత్స అనంతరం కొంత కాలం ఆరోగ్యం మెరుగయ్యింది. కానీ మార్చిలో పరిస్థితి మళ్లీ దిగజారడంతో ఆహారం తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ సమయంలో కుటుంబం ఆమెను జైన్ ముని రాజేశ్ ముని మహారాజ్ వద్దకు తీసుకెళ్లింది. ఆయన సూచన మేరకు తల్లిదండ్రులు సంతారాను అంగీకరించారు. మతపరమైన విధులు పూర్తయ్యాక కొన్ని నిమిషాల్లోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
వియానా జైన్‌ను 'సంతారా ఆచారం చేపట్టిన కనిష్ట వయస్కురాలు'గా గుర్తిస్తూ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ జారీ చేసింది. కానీ ఈ విషయంపై సున్నితమైన మతసంబంధ నిబంధనలు, చిన్నారుల హక్కులు, శిశుసంరక్షణ చట్టాల కణం కదిలేలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే 2015లో రాజస్థాన్ హైకోర్టు సంతారాను IPC సెక్షన్ల ప్రకారం శిక్షార్హంగా ప్రకటించగా, సుప్రీంకోర్టు ఆ ఆదేశంపై స్టే విధించింది. అయితే ఇప్పుడు ఈ చిన్నారి ఉదంతంతో మళ్లీ ఈ చర్చలు ముదురే అవకాశముంది. మతపరమైన నమ్మకాలతో పాటు, జీవిత హక్కు, బాలల హక్కులు వంటి అంశాలు ఎదురెదురుగా నిలిచిన ఈ ఘటనపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, మానవ హక్కుల సంస్థలు స్పందించాల్సిన అవసరం తప్పదు.