Chhattisgarh: ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh: మృతుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్ రావు

Update: 2024-04-17 03:37 GMT

Chhattisgarh: ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. తూటాల వర్షంతో ఛత్తీస్‌గఢ్‌ అడవులు దద్దరిల్లాయి. మావోయిస్టులు, జవాన్ల మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో ఒక ఇన్ స్పెక్టర్ తో సాహ ఇద్దరు బీఎస్ఎఫ్ జనావన్లు గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, తుపాకులు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రూపాయల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్ రావు కూడా మరణించినట్టు తెలుస్తోంది.

బీఎస్ఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేస్తుండగా.. చోటేబేధియా పీఎస్ పరిధిలోని హపటోలా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ మొదలయ్యింది. హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్టు అందిన సమాచారంతో అప్రమత్తమైన బలగాలు గాలింపు చేపట్టారు. కాల్పుల అనంతరం 29 మంది మృత దేహాలు లభించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారిలో ముగ్గురిని మావోయస్టు ఉత్తర బస్తర్ డివిజన్ కు చెందిన కేడర్ సభ్యులు శంకర్ రావు, లిత, వినోద్ గా గుర్తించామన్నారు. మొత్తం 60 నుంచి 70 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం తీవ్రకలకలం రేపుతోంది.  

Tags:    

Similar News