Tamil Nadu: చెన్నై సమీపంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్ల మృతి..!
Chennai: చెన్నై తాంబరం సమీపంలోని గుడువంచెరిలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతిచెందారు.
Tamil Nadu: చెన్నై సమీపంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్ల మృతి..!
Chennai: చెన్నై తాంబరం సమీపంలోని గుడువంచెరిలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతిచెందారు. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ తనిఖీలో ఉండగా, తెల్లవారుజామున బ్లాక్ స్కోడా కారులో అక్కడికి వచ్చిన నలుగురు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్ స్వల్పంగా గాయపడగా, ఇద్దరు నిందితులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. గాయపడిన నిందితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఇద్దరు నిందితులు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు చేస్తున్నారు.