Maharashtra: నాందేడ్‌ గొడవల్లో 17 మంది అరెస్ట్

Maharashtra: హత్యాయత్నం కేసు నమోదు * నిన్న హోలా మొహల్లా సందర్భంలో చెలరేగిన హింస

Update: 2021-03-30 07:06 GMT

Representational Image

Maharashtra: మహారాష్ట్రలోని నాందేడ్‌లో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిలో 17 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిపై హత్యాయత్నం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిన్న జరిగిన హోలా మొహల్లా కార్యక్రమం నియంత్రించేందుకు వెళ్లిన పోలీసులపై అక్కడి ప్రజలు దాడి చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

నాందేడ్‌లో సచ్‌ఖండ్ హజూర్ సాహిబ్ గురుద్వారాలో హోలీ సందర్భంగా హోలా మహల్లా కార్యక్రమం జరిగింది. అయితే అక్కడకు భారీగా చేరుకున్న యువత కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ హోలా మొహల్లాలో పాల్గొన్నారు. దీంతో నిర్వాహకులు గురుద్వారా గేటుకు తాళం వేయగా అక్కడున్న కొందరు గేటును ధ‌్వంసం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగగా.. ఒక్కసారిగా జనం వారిపైకి ఎగబడ్డారు. కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయాలపాలయ్యారు.

Tags:    

Similar News