నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టం చూసి తల్లడిల్లిన కొడుకు.. ఇంటి వద్దనే బావి తవ్విన 14 ఏళ్ల బాలుడు
Maharashtra: తల్లికి ఏదైనా సాయం చేయాలనుకున్నడు ప్రణవ్ సాల్కర్
నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టం చూసి తల్లడిల్లిన కొడుకు.. ఇంటి వద్దనే బావి తవ్విన 14 ఏళ్ల బాలుడు
Maharashtra: ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకురావడానికి తన తల్లి పడుతున్న కష్టాలు చూసిన ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. ప్రతీ రోజు ఎండలో నడుచుకుంటూ నదిలోకి వెళ్లి నీళ్లు తేవడం తట్టుకోలేకపోయాడు. తల్లి కష్టాన్ని తగ్గించాలని అనుకున్నాడు. దీని కోసం తన ఇంటి వద్దనే బావి తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బావి తవ్వడం మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో ఆ తల్లి నీటి కష్టాలు తీరిపోయాయి.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడు చేసిన పని ఇప్పుడు అందరితో ప్రశంసలు అందుకుంటోంది. ఆ పిల్లాడు తన తల్లి కోసం ఏకంగా బావినే తవ్వాడు. కెల్వే గ్రామంలోని ప్రణవ్ రమేష్ అనే 14 ఏళ్ల బాలుడు స్థానికంగా ఉండే ఆదర్శ విద్యా మందిర్ లో చదువుతున్నాడు. ఆ బాలుడు తన తండ్రి వినాయక్, తల్లి దర్శనతో కలిసి తన గ్రామంలో ఓ గుడిసెలో నివసిస్తున్నాడు.