Tamil Nadu: తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి

Tamil Nadu: ఇంకా వరదలోనే ఉన్న చెన్నైలోని పలు ప్రాంతాలు

Update: 2023-12-06 01:47 GMT

Tamil Nadu: తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి

Tamil Nadu: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. వీరంతా వరదల్లో చిక్కుకుని, భవనం కూలిపోయి, గోడ, చెట్లు మీదపడి, మరికొందరు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చెన్నైతో పాటు పరిసర పలు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. చెన్నైలోని చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. మరోవైపు నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు.

Tags:    

Similar News