Supreme Court: ఆక్సిజన్‌ సరఫరా పెంచేందుకు రంగంలోకి సుప్రీం కోర్టు

Supreme Court: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నేరుగా రంగంలోకి దిగింది.

Update: 2021-05-09 04:33 GMT

సుప్రీంకోర్టు(ఫైల్ ఇమేజ్ )


Supreme Court: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నేరుగా రంగంలోకి దిగింది. మెడికల్ ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూసేందుకు 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ అవసరాన్ని మదింపు చేసి, సిఫారసు చేయడంతోపాటు పంపిణీ బాధ్యతలను కూడా ఈ కమిటీ నిర్వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు అత్యవసర మందులు, ప్రజారోగ్య సేవలను కూడా ఈ కమిటీ అందిస్తుంది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. టాస్క్‌ఫోర్స్‌లోని 12 మంది సభ్యుల్లో 10 మంది వైద్యులుంటారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

Tags:    

Similar News