Maharashtra: అవార్డుల ప్రధానోత్సవంలో విషాదం.. వడదెబ్బ కారణంగా 11 మంది మృతి.. వంద మందికి పైగా అస్వస్థత

Maharashtra: ఎండ తీవ్రత కారణంగా చాలామంది వడదెబ్బకు గురయ్యారు

Update: 2023-04-17 06:56 GMT

Maharashtra: మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రధానోత్సవంలో విషాదం.. వడదెబ్బ కారణంగా 11 మంది మృతి.. వంద మందికి పైగా అస్వస్థత

Maharashtra: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముంబయిలో నిర్వహించిన మహారాష్ట్ర భూషణ్' అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించగా... ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్నవారిలో వడదెబ్బ కారణంగా 11 మంది మరణించగా.., వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ మైదానంలో కేవలం వీఐపీలు కూర్చునేందుకు మాత్రమే టెంట్లను ఏర్పాటు చేశారు. మిగిలిన మైదానంలో ఎక్కడా టెంట్లు ఏర్పాటు చేయలేదు.

దీంతో కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఎండలోనే ఉండి వీక్షించారు. మహారాష్ట్ర నుంచి మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.ఎండ తీవ్రత కారణంగా చాలామంది వడదెబ్బకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News