దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తల్లి కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తల్లి యలమంచిలి రత్నకుమారి (88) కన్నుమూశారు.

Update: 2025-09-26 04:50 GMT

దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తల్లి కన్నుమూత 

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తల్లి యలమంచిలి రత్నకుమారి (88) కన్నుమూశారు. సెప్టెంబర్ 25, 2025న రాత్రి 8.31 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చౌదరి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆయన తన ప్రకటనలో "పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?" అనే సామెతకు తన తల్లి సరిగ్గా సరిపోతారని పేర్కొన్నారు. అయితే, ఎలాంటి చదువు లేకపోయినా, ఆమె తన ముగ్గురు పిల్లలను అద్భుతంగా పెంచారని చెప్పారు. కేవలం లారీ డ్రైవర్‌గా పనిచేసే తన తండ్రి యలమంచిలి నారాయణరావు సంపాదనతోనే ఇంటి ఆర్థిక అవసరాలు, పోషకాహారం, విద్య, వైద్యం, వినోదం వంటి అన్నింటినీ ఆమె సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ఆమె కేవలం బడ్జెట్‌ను లెక్కించడమే కాకుండా, ఎటువంటి సహాయం లేకుండా ఇంటి పనులన్నీ స్వయంగా చేస్తూ, తమకు ఒక ఆదర్శమూర్తిగా నిలిచారని చౌదరి పేర్కొన్నారు.

తన తల్లి తనలో నింపిన లక్షణాలు, ఆవిడ నేర్పిన జీవిత పాఠాలు ఏ చదువు నేర్పలేనివని ఆయన అన్నారు. ఇప్పుడు తన తల్లి ఆ దివిలో ఉన్న తన తండ్రి, సోదరుడిని కలవడానికి వెళ్లారని ఆయన భావోద్వేగంగా తెలిపారు. తన తల్లి పంచిన రక్తం, ఆమె నింపిన లక్షణాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని వై.వి.ఎస్. చౌదరి పేర్కొన్నారు.

Tags:    

Similar News