Writer Padmabhushan: ఉచిత ప్రదర్శన.. థియేటర్ల జాబితా ఇదే!
Writer Padmabhushan: మహిళలకు ఉచితంగా సినిమాని ప్రదర్శిస్తున్న రైటర్ పద్మభూషణ్ బృందం
Writer Padmabhushan: ఉచిత ప్రదర్శన.. థియేటర్ల జాబితా ఇదే!
Writer Padmabhushan: యువ నటుడు సుహాస్ హీరోగా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "రైటర్ పద్మభూషణ్". షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్ మరియు ట్రైలర్లతోనే ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకుపోతోంది. సినిమా కథ చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుందట. మహిళల కోసం ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం అంటే ఫిబ్రవరి 8న రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని థియేటర్లలో ఈ సినిమాని మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నారు దర్శక నిర్మాతలు. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38 థియేటర్లను ఎంపిక చేశారు.
మంచి మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా అందరికీ మన్ననలను అందుకుంటుంది. సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇది కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. దీంతో ఎమోషనల్ అయిన సుభాష్ కూడా మహేష్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆడవాళ్లకు ఉచితంగా సినిమాని ప్రదర్శిస్తూ చిత్ర బృందం అందరి దృష్టిని బాగానే ఆకట్టుకుంటుంది.