అసలు ఆ డైరెక్టర్ తో విజయ్ సినిమా ఉంటుందా?
Vijay Devarakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా "లైగర్" త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతోంది.
అసలు ఆ డైరెక్టర్ తో విజయ్ సినిమా ఉంటుందా?
Vijay Devarakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా "లైగర్" త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ "ఖుషి" అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. మరోవైపు మళ్ళీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "జనగణమన" అనే ఒక కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశారు విజయ్.
ఇక విజయ్ దేవరకొండ సుకుమార్ తో ఒక సినిమా చేయాలని ఆ సినిమా 2024లో రాంపేజ్ అవుతుందని అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా వినిపించాయి. పైగా ఆ దర్శకుడితో విజయ్ ఫోటో కూడా బయటికి రావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కానీ సుకుమార్ ప్లానింగ్ చూస్తూ ఉంటే విజయ్ దేవరకొండ తో అసలు సుకుమార్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అని సందేహాలు కూడా వస్తున్నాయి. సినిమా కోసం పూర్తి స్క్రిప్ట్ అయితే ఇంకా పూర్తి కాలేదు. కేవలం ఒక లైన్ ని అనుకొని దాన్ని విజయ్ దేవరకొండకు చెప్పారట. విజయ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ తో కూడా మరొక సినిమా పూర్తి చేయాల్సింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా "పుష్ప" రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" సినిమాని త్వరలోనే మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే "పుష్ప 2" విడుదలవడానికి 2024 అవుతుందని కొందరు చెబుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తారా లేక విజయ్ దేవరకొండ ని లైన్ లో పెడతారా అని ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.