పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాకే తన సమయాన్ని కేటాయించనున్నారా?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ సినిమానే పూర్తి చేయనున్నారా?
పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాకే తన సమయాన్ని కేటాయించనున్నారా?
Pawan Kalyan: ఈ మధ్యనే "భీమ్లా నాయక్" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఏ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలను పక్కన పెట్టేసి రాజకీయ పనులతో బిజీ అయిపోయారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గురించి చాలా పుకార్లు బయటకు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క సినిమా షూటింగ్ మాత్రం పూర్తి చేసి రాజకీయ పనుల్లోకి పూర్తిగా దిగిపోనున్నారు అని వార్తలు వినిపించాయి.
అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న "వినోదయ సితం" తెలుగు రీమేక్ ని సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పూర్తి చేయబోతున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ త్వరలో పూర్తిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒప్పుకున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలుపెట్టలేనని పవన్ కళ్యాణ్ చెప్పేయడంతో హరీష్ శంకర్ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సినిమా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.