100 కోట్ల సినిమాతో అనుపమ పరమేశ్వరన్ భవిష్యత్తు మారనుందా?
Anupama Parameswaran: ఇకనైనా 100 కోట్ల హీరోయిన్ కి స్టార్ హీరో ఆఫర్లు వస్తాయా?
100 కోట్ల సినిమాతో అనుపమ పరమేశ్వరన్ భవిష్యత్తు మారనుందా?
Anupama Parameswaran: కొన్నిసార్లు సినిమా కోసం ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. కానీ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం అది భవిష్యత్తు ను మార్చేసే విధంగా ఉంటుంది. టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ విషయంలో కూడా అదే జరగబోతోందా అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "అ ఆ" సినిమాతో సెకండ్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్" సినిమాలో కూడా నటించింది. "శతమానం భవతి" సినిమాతో హీరోయిన్ గా మొట్టమొదటి సూపర్ హిట్ ను అందుకుంది అనుపమ.
కానీ ఆ తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇక అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ మధ్యనే విడుదలైన "రౌడీ బాయ్స్" సినిమాలో ఈమె లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది. కానీ అది కూడా తనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ ఈ మధ్యనే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నిఖిల్ హీరోగా నటించిన "కార్తికేయ 2" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసి ట్రేడ్ వర్గాలకు సైతం ఈ సినిమా షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తరువాత అయినా అనుపమ పరమేశ్వరన్ కు స్టార్ హీరో సినిమాలలో నటించే అవకాశం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.