OTT Movie: భార్యను చంపి కూతురుతో ఆ పని చేసిన సైకో… పనోడు కూడా అలాంటోడే

Update: 2025-02-11 08:51 GMT

OTT Movie : భార్యను చంపి కూతురుతో ఆ పని చేసిన సైకో… పనోడు కూడా అలాంటోడే

OTT Movie Welcome Home: కొంతమంది సైకోలు చేసే హింసను చూస్తే మన ఒళ్ళు జలదరిస్తాయి. అలాంటి దారుణ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన "వెల్కమ్ హోమ్" అనే సైకో థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఒక కొత్త అనుభవానికి గురిచేస్తోంది. 2020లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథ ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు అనూజ (కశ్మీరా ఇరానీ), స్నేహ (స్వర్దా తీగలే) చుట్టూ తిరుగుతుంది.

అనూజకు ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లిచూపులు కూడా చూస్తూ ఉంటారు. ఒకరోజు అనూష తన కొలీగ్ స్నేహతో కలిసి జనాభా లెక్కల కోసం మరో గ్రామానికి వెళుతుంది. ఇంటింటికీ తిరిగి జనాభా లెక్కలు రాసుకుంటుంది. అయితే ఒక ఇల్లు ఊరికి దూరంగా ఉండడంతో వారిద్ధరూ అక్కడికి వెళ్లతారు. ఆ ఇల్లు ఉన్న ప్రాంతం చుట్టూ నిర్మానుష్యంగా ఉంటుంది. ఆరోజు వర్షం పడడంతో వేరే దారి లేక వీళ్ళిద్దరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ప్రేరణ అనే గర్భవతి ఉంటుంది వీళ్లు జనాభా లెక్కల గురించి అడుగుతుండగా, ఒక ముసలామె వచ్చి వివరాలను చెబుతుంది. ప్రేరణకి గన్ శ్యామ్ భర్తగా చెప్తుంది ఆ ముసలామె.

వీళ్ళ ప్రవర్తన చాలా అనుమానంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒక పనివాడు కూడా ఉంటాడు. స్నేహతో ఆ పని చేయాలని ఆతృతగా ఉంటాడు ఆ పనోడు. అనూజ, స్నేహకు రాత్రిపూట అక్కడకొన్ని శబ్దాలు వినపడతాయి. బయటికి వచ్చి చూస్తే, ఒక వ్యక్తిని బాగా కొట్టి గదిలో బంధించి ఉంటారు. వీళ్లు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడున్న గన్ శ్యామ్, పనివాడు వీళ్లను కొట్టి బంధిస్తారు. అయితే నిజానికి ప్రేరణ గన్ షామ్ భార్య కాదు. ఆమె అతడి కూతురు. కూతురిని గర్భవతిని చేసి, ఆమె తల్లిని చంపేసి ఉంటాడు గన్ షామ్. మరోవైపు ఈ టీచర్ల కోసం వచ్చిన వాళ్లను కూడా చంపేస్తుంటుంది ఈ సైకో ఫ్యామిలీ. చివరికి వాళ్లు ఆ ఇంట్లో నుంచి తప్పించుకుంటారా? ఆ సైకోల చేతిలో బలవుతారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘వెల్కమ్ హోమ్’ అనే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ సినిమా అత్యంత ఉత్కంఠతో, సైకో ఎలిమెంట్స్‌తో నిండిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో బోలోరామ్ దాస్, శశి భూషణ్, టీనా భాటియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. "వెల్కమ్ హోమ్" మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, స్టార్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సైకో మిస్టరీ థ్రిల్లర్ ప్రేమికులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. పుష్కర్ మహాబల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాత్రి పూట థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా మంచి అనుభవాన్ని ఇస్తుంది.

Tags:    

Similar News