Kannappa: సెకండాఫ్ లో అదరగొట్టిన విష్ణు.. మోహన్ బాబు డైలాగ్స్, ప్రభాస్ ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లాయ్

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

Update: 2025-06-27 05:42 GMT

Kannappa: సెకండాఫ్ లో అదరగొట్టిన విష్ణు.. మోహన్ బాబు డైలాగ్స్, ప్రభాస్ ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లాయ్

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పెద్ద స్టార్లు ముఖ్య పాత్రల్లో నటించడంతో ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమా చూసిన ప్రేక్షకులు కొన్ని కీలక అంశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు.

తిన్నడు తండ్రి నాథనాథుడు పాత్రలో శరత్ కుమార్ కనిపించారు. ఆయన గంభీరమైన వాయిస్, పాత్రకు తగ్గ అభినయం సినిమాకు ఒక మంచి బలాన్నిచ్చాయని ప్రేక్షకులు అంటున్నారు. పాత్ర నిడివి తక్కువే అయినా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రకు గౌరవాన్ని తీసుకొచ్చింది. అలాగే నెమలి పాత్రలో కనిపించిన ప్రీతి ముకుందన్ చాలా అందంగా కనిపించారని, పాటల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని టాక్. విష్ణుతో ఆమె కెమిస్ట్రీ కూడా ఓకే అనిపించింది. కథలో నెమలి పాత్రకు ప్రాధాన్యం ఉండడంతో పరిమితి వరకు ప్రీతి ముకుందన్ నటించిందని చెబుతున్నారు.

కన్నప్ప సినిమాకు అతి పెద్ద హైలైట్లలో ఒకటిగా మోహన్ బాబు నటన నిలిచింది. ఆయన పాత్ర ఏదైతేనేం, స్క్రీన్ మీద ఉన్న ప్రతీసారి థియేటర్లో చప్పట్లు, ఈలలు పడ్డాయని సమాచారం. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ చాలా పవర్ఫుల్‌గా, తనదైన స్టైల్‌లో ఉండటంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఆయన వచ్చిన ప్రతి సీన్ సినిమాకు ఒక వెయిట్ తీసుకొచ్చింది. ఇక ప్రభాస్ రుద్ర పాత్రలో ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లలో ప్రేక్షకులతో పూనకాలు తెప్పించిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. అభిమానులు కేకలతో, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయని తెలుస్తోంది. ప్రభాస్ పాత్ర నిడివి తక్కువే అయినా, ఆయన ఉన్నంత సేపు సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించిందని టాక్. ఆయన చెప్పిన డైలాగులు చాలా పవర్ఫుల్‌గా ఉండటంతో అవి సినిమాకు భారీ హైప్ తెచ్చాయి.

ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంత కష్టపడ్డాడో తెరపై స్పష్టంగా కనిపించిందని ప్రేక్షకులు అంటున్నారు. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ లో భక్త కన్నప్పగా మారిన తర్వాత ఆయన నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. శివుడిపై భక్తితో కళ్లు పీకడానికి సిద్ధపడే సన్నివేశాలు, ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ లో విష్ణు నటన చూస్తే కళ్ళలో నీళ్లు రావడం ఖాయమని చెబుతున్నారు. సినిమా చూసిన చాలామంది విష్ణు తన నటనతో సినిమాను నిలబెట్టేశాడని అభిప్రాయపడుతున్నారు. అలాగే 'కన్నప్ప' సినిమాకు పాటలు ఒక ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సీ ఇచ్చిన పాటలు చాలా వినసొంపుగా ఉన్నాయని, ముఖ్యంగా భక్తిభావం ఉట్టిపడే పాటలు, అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ పాటలు అన్నీ బాగున్నాయని టాక్. తెరపై పాటలు విజువల్‌గా చాలా అందంగా కనిపించాయి.

ఈ సినిమాకు క్లైమాక్స్ అనేది చాలా కీలకం. శివుడిపై తిన్నడుకున్న అచంచల భక్తిని చూపించే సన్నివేశాలు చాలా ఉద్వేగభరితంగా ఉన్నాయని చెబుతున్నారు. విష్ణు నటన ఇక్కడ పీక్స్ లో ఉండటంతో, చాలామంది క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకున్నారని తెలుస్తోంది. సినిమా ముగిసిన తర్వాత కూడా ఆ క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను వెంటాడుతున్నాయి. మొత్తంగా, 'కన్నప్ప' సినిమా విష్ణు కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని, ప్రభాస్, మోహన్ బాబు వంటి వారి పాత్రలు సినిమాకు పెద్ద బూస్ట్‌ను ఇచ్చాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News