Vikram Vedha: "విక్రమ్ వేద" తెలుగు రీమేక్ ఇంక జరగదా?

Vikram Vedha: "విక్రమ్ వేద" తెలుగు రీమేక్ ఇంక జరగదా?

Update: 2022-10-10 11:28 GMT

Vikram Vedha: "విక్రమ్ వేద" తెలుగు రీమేక్ ఇంక జరగదా?

Vikram Vedha: ఈమధ్య కాలంలో ఏదైనా ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అయితే దాన్ని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేస్తున్నారు మన హీరోలు. లేదా ఏకంగా తెలుగులో రీమేక్ చేసేస్తున్నారు. ఆ విధంగానే అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్ వంటి సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి, బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టాయి. కానీ కొన్ని సూపర్ హిట్ సినిమాలు మాత్రం రీమేక్ కి నోచుకోలేదు.

అందులో "విక్రమ్ వేద" కూడా ఒకటి. మాధవన్ మరియు విజయ్ సేతుపతిలు నటించిన ఈ పోలీస్ - రౌడీ డ్రామా తమిళ్ లో కల్ట్ హిట్‌గా మారింది. తాజాగా హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీ ఖాన్ నటించిన హిందీ వెర్షన్ డిజాస్టర్ అయ్యింది. హిందీ విక్రమ్ వేద బాక్సాఫీస్ వద్ద 61 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మేకింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులే 150 కోట్లు అయ్యాయి కాబట్టి ఇది చాలా తక్కువ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు.

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ హిందీ రీమేక్ రిజల్ట్ చూశాక నిర్ణయం తీసుకుందామని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఈ సినిమాను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తమిళ్ మరియు హిందీ సినిమాలు రూపొందించిన ఒరిజినల్ డైరెక్టర్లు పుష్కర్ మరియు గాయత్రి కూడా సినిమాని రెండు సార్లు డైరెక్ట్ చేసేసరికి తెలుగు రీమేక్‌ వద్దని నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News