Vijay Sethupathi: కుటుంబ ఖర్చుల కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేశా..

Update: 2021-08-03 05:54 GMT

విజయ్  సేతుపతి (ఫైల్ ఫోటో)

Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన కెరీర్లో దాదాపుగా 50 కి పైగా సినిమాల్లో నటించి దక్షిణాది సినిమా పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు పొందటమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సేతుపతిని అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటారు. కష్టం అంటే తెలిసిన స్థాయి నుండి ఎదిగిన విజయ్ సేతుపతి వంటి నటులు సినిమా రంగంలో ఒక మంచి స్థాయిలో ఉండటం నిజంగా సగటు అభిమాని గర్వించదగ్గ విషయమే. ఇక విజయ్ సేతుపతి తన బాల్యంలో చదువులో వెనుకబడిన ఇంట్లో తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను గమనించి పదో తరగతి పూర్తి అవగానే ఒక రిటైల్ షాప్ లో సేల్స్ మ్యాన్ గా ఉద్యోగంలో చేరాడు.

ఆ తరువాత ఒక ఫోన్ బూత్ ఆపరేటర్ గా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో క్యాషియర్ గా ఎన్నో పనులను చేస్తూనే మరోపక్క తన చదువుని కూడా కొనసాగించాడు. తన 16 ఏళ్ళ వయసులోనే తమిళ సినిమా "నమ్మవర్" చిత్రంలో ఆడిషన్ కి వెళ్లిన తన ఎత్తు తక్కువగా ఉండటంతో ఆ సినిమా నుండి కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.

ఇక తను చేస్తున్న పనితో ఆర్థికంగా ఎదగలేక తమ ఇద్దరు సోదరులను, ఒక చెల్లిని పోషించాలంటే భారత్ లో కంటే దుబాయ్ లో నాలుగు రెట్లు అధికంగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో అరబ్ కంట్రీకి వెళ్లి ఒక అక్కడ ఒక కంపెనీలో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడు విజయ్. ఆ తరువాత ఆన్లైన్ లో పరిచయమైనా జెస్సి అనే అమ్మాయిని ప్రేమించిన విజయ్ ఆమెని పెళ్లి చేసుకోడానికి చెన్నైకి తిరోగోచ్చి తనని పెళ్ళాడి సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ యాక్టర్ గా మరోసారి కెరీర్ ని మొదలు పెట్టి షార్ట్ ఫిలిమ్స్, ప్లే బ్యాక్ సింగర్ గా కొనసాగుతూ 2006 లో ఒక ఆడిషన్ కి వెళ్ళిన విజయ్ ధనుష్ స్నేహితుడిగా "పుదుపెట్టై" సినిమాతో మరోసారి ఎంట్రీతో ఇక విరామం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో విజయ్ సేతుపతిని ఎవరు మిమ్మల్ని ముందుగా గుర్తించారు అనే ప్రశ్నకి తనలో ఒక నటుడు ఉన్నాడని నాకు నమ్మకం వచ్చాకే సినిమాల్లోకి వచ్చానని, ఎంతమంది మనల్ని నమ్మిన నమ్మకపోయిన మనమీద మనకు నమ్మకం ఉంటె ఏదైనా సాధించగలుగుతాం అని "మక్కల్ సెల్వన్" తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు.    

Tags:    

Similar News