Vijay Deverakonda: రౌడీ స్టార్ ప్లాన్ ఛేంజ్: విజయ్ దేవరకొండ ఫోకస్ ఇప్పుడు 'రౌడీ జనార్ధన్'పైనే!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల మధ్య కూడా కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
Vijay Deverakonda: రౌడీ స్టార్ ప్లాన్ ఛేంజ్: విజయ్ దేవరకొండ ఫోకస్ ఇప్పుడు 'రౌడీ జనార్ధన్'పైనే!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల మధ్య కూడా కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పీరియాడిక్ డ్రామా ముందు మాస్ ఎంటర్‌టైనర్‌పై దృష్టి సారించాడు.
విజయ్ దేవరకొండ రెండు కొత్త చిత్రాలతో సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ డ్రామా ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్‌లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో మాస్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ జనార్ధన్’ మరొకటి.
మొదట పీరియాడిక్ చిత్రం పూర్తి చేయాలని భావించిన విజయ్, దాని భారీ బడ్జెట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ కావడంతో ప్లాన్ మార్చాడు. ఇప్పుడు ‘రౌడీ జనార్ధన్’పై పూర్తి దృష్టి పెట్టాడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ డ్రామా మాత్రం 2027లో విడుదలకు సిద్ధంగా ఉంటుంది.