Pushpaka Vimanam: తమ్ముడిని నిద్రలేపి సినిమా ప్రమోషన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
తమ్ముడిని నిద్రలేపి సినిమా ప్రమోషన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
Vijay Deverakonda - Pushpaka Vimanam: విజయ్ దేవరకొండ నిర్మాతగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పుష్పకవిమానం సినిమా ప్రమోషన్ ని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విభిన్నంగా చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో బెడ్ పై పడుకొని నిద్రలేచిన విజయ్ దేవరకొండ పక్కన ఉన్న తన తమ్ముడిని నిద్ర లేపుతూ ఇక్కడకి ఎలా వచ్చావు.. మీ వైఫ్ ఎక్కడ.. ఎక్కడ ఉంది మీ వైఫ్ అని పదే పదే అడగడంతో ఆనంద్ దేవరకొండ నా వైఫ్ లేచిపోయిందంటూ చెప్పిన సమాధానంతో పాటు సినిమా విడుదల తేదీని చెప్తూ పెట్టిన వీడియో స్టేటస్ తో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాని సినిమా ప్రమోషన్ బాగానే ఉపయోగించుకుంటున్నాడు. దామోదర దర్శకత్వం వహిస్తున్న ఈ పుష్పకవిమానం సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.