Liger Movie Collections: మిక్స్డ్‌ టాక్‌తో దుమ్ము రేపిన లైగర్.. మొదటి రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే..!

Liger Movie Collections: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' చిత్రం ఆగష్టు 25వ తేదీన విడుదలైంది.

Update: 2022-08-26 09:39 GMT

Liger Movie Collections: మిక్స్డ్‌ టాక్‌తో దుమ్ము రేపిన లైగర్.. మొదటి రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే..!

Liger Movie Collections: యువ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' చిత్రం ఆగష్టు 25వ తేదీన విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. మెజారిటీ మంది ఈ సినిమా బాగాలేదని అంటుంటే కొంతమంది మాత్రం బాగానే ఉందంటున్నారు. అయితే ఇలాంటి టాక్ నేపథ్యంలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.33.12 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. బ్లాక్‌బస్టర్‌ లైగర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ని జత చేస్తూ ట్వీట్‌ చేసింది.



 


Tags:    

Similar News