Vijay devarakinda in megastar movie: చిరు మూవీలో రౌడీ విజయ్!

Vijay devarakinda in megastar movie: మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రంలో నేటి యంగ్ క్రేజీ స్టార్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Update: 2020-07-08 17:11 GMT
Vijay Devarakonda to play a key role in Chiranjeevi upcoming movie

Vijay devarakinda in megastar movie: మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రంలో నేటి యంగ్ క్రేజీ స్టార్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రంలో నటించనున్నారు.దీనికి 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మలయాళ లూసిఫర్‌ చిత్రంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ఆ పాత్రను పోషించారు. అయితే తెలుగులో మాత్రం మొదట్లో ఆ పాత్రకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది.

అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ అర్జున్ రెడ్డి ని సంప్రదించారని, అయితే దీనికి సంబంధించి విజయ్‌ ఇంకా ఏ విషయం ఫైనల్‌ చేయనట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా, ఈ సినిమాలో ఆ పాత్ర షూటింగ్‌కు తక్కువ రోజులో అవసరమవుతాయి కాబట్టి విజయ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చని అంటున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం లూసిఫర్‌ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Tags:    

Similar News