allu arjun: బన్నీకి టాప్ ప్లేస్.. ఆ తర్వాతే మహేష్, ప్రభాస్!

allu arjun: బన్నీకి టాప్ ప్లేస్.. ఆ తర్వాతే మహేష్, ప్రభాస్!
x
Highlights

allu arjun: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం అల వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అటు అల్లు అర్జున్ కెరీర్లో ఇది త్రివిక్రమ్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచింది.

allu top in list : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం అల వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అటు అల్లు అర్జున్ కెరీర్లో ఇది త్రివిక్రమ్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచింది.. అయితే తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో అల్లు అర్జున్ కి ప్రథమ స్థానం లభించింది. ఆ తరవాత స్థానాల్లో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఉన్నారు.. అయితే మెగా తనయుడు రామ్ చరణ్ మాత్రం నాని, విజయ్ దేవరకొండ ల తరవాత ఉండడం గమనార్హం..

అయితే ఈ సర్వేని ఏ ప్రాతిపదికన చేసినా కానీ రకరకాల కోణాల్లో స్టార్ల స్థానంపై చూడల్సి వస్తుంది. రామ్ చరణ్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అనిపించుకుంది రంగస్థలం మూవీ.. ఈ సినిమా తరవాత వినయ విధేయ రామ అనే సినిమాని చేశాడు రామ్ చరణ్.. కానీ ఆ సినిమా బెడిసికట్టింది.. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కుతున్న RRR అనే చిత్రంలో నటిస్తున్నాడు..సో అంతా గ్యాప్ రావడంతో కాస్త ఆన్ లైన్ సర్వేలో ఓటింగ్ పరంగా అది తేడా కొట్టి ఉంటుందని కొందరు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇందులో అల వైకుఠపురములో చిత్రం సరిలెరు నీకేవ్వరు సినిమాపై పై చేయి సాధించడంతో అల్లు అర్జున్ కి మొదటి ప్లేస్, మహేష్ బాబు కి రెండో ప్లేస్ వచ్చిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సాహో లాంటి ప్లాప్ చిత్రంతో ముందుకు వచ్చిన ప్రభాస్ మూడో స్థానంలో నిలిచాడు..

ఇక తమిళ హీరోల విషయానికి వచ్చేసరికి విజ‌య్ తొలి స్థానంలో ఉండగా ఆ త‌ర్వాత అజిత్‌, సూర్య‌, ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ సేతుప‌తి, ధ‌నుష్, క‌మ‌ల్ హాస‌న్, శివ‌కార్తికేయ‌న్‌, విక్ర‌మ్, జ‌యం ర‌వి ఉన్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories