అల...ఫేస్‌బుక్ లొ..! బన్నీ రికార్డ్!

admin
Published on: 9 Jun 2020 9:37 PM IST
అల...ఫేస్‌బుక్ లొ..! బన్నీ రికార్డ్!
X
Allu Arjun (File Photo)

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులు సొంతం తన చేసుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.. పూరీ జగన్నాధ్దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'గంగోత్రి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. కెరీర్ మొదట్లోనే అగ్రదర్శకులతో కలిసి పనిచేసే అవకాశం సంపాదించుకున్నాడు. దాదాపు 17 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి ఎన్నో విజయాలను తన కతాలో వేసుకున్నాడు.

గంగోత్రి నుంచి రేసుగుర్రం దాకా.. s/o సత్యమూర్తి నుంచి ఆల.. అల వైకుంఠపురములో దాకా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసి తనకంటూ సొంతగా ఇమేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండని అల్లు అర్జున్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. ఇటీవలే 'కింగ్ ఆఫ్ సోషల్ మీడియా' అనే ట్యాగ్ కూడా తెచ్చుకున్నారు. ఇక ఫేస్‌బుక్ పేజీలో తన పోస్టులకు గాను మొత్తంగా 13,098,118 లైకులు సంపాదించి ఏ సౌత్ ఇండియన్ స్టార్ అందుకొని ఫీట్ సొంతం చేసుకున్నారు. ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రం ఎంతటి ఘాన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం 'పుష్ప'.ఈ సినిమా ఫస్ట్‌లుక్ బ‌న్ని పుట్టినరోజు సంద‌ర్భంగా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బ‌న్ని స‌ర‌స‌న కథానాయికగా రష్మిక నటిస్తున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 20 శాతం మాత్రమే పూర్తి అయింది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి.


View this post on Instagram

Thank you for all the Love . Gratitude Forever

A post shared by Allu Arjun (@alluarjunonline) on


admin

admin

Next Story