ఆ వార్త విని,నా గుండె ప‌గిలింది: ర‌జ‌నీకాంత్‌

Arun Chilukuri
Published on: 30 April 2020 10:54 AM IST
ఆ వార్త విని,నా గుండె ప‌గిలింది: ర‌జ‌నీకాంత్‌
X

ప్రముఖ నటుడు రిషి కపూర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ను ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్‌ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషీకపూర్‌ మృతిపై అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు రిషీకపూర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా ర‌జ‌నీకాంత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా రిషీ క‌పూర్ మ‌ర‌ణంపై స్పందించారు. గుండె ప‌గిలినంత ప‌ని అయింది. నీ ఆత్మ‌కి శాంతి చేకూరాలి నా ప్రియ‌మైన స్నేహితుడా అని ట్వీట్‌లో తెలిపారు ర‌జ‌నీకాంత్‌.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story