Ram Charan with Pawan Kalyan : మెగా ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త!

Ram charan with Pawan Kalyan : ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేస్తున్నాడు

Krishna
Updated on: 6 July 2020 2:29 PM IST
Ram Charan with Pawan Kalyan : మెగా ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త!
X

Ram charan with Pawan Kalyan : ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ న్యూస్ ని ఆఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమాని కళ్యాణ్ రామ్, కే రాధాకృష్ణ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడి తాజాగా మొదలైంది.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ కొత్త సినిమాను కూడా సెట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే చరణ్, చిరంజీవికి త్రివిక్రమ్ ఓ లైన్ వినిపించాడట.. చరణ్ తో ఈ సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని పవన్ తో పాటు రాధాకృష్ణ హాసిని హారిక బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉంది. ఇక చరణ్ కూడా ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ త్రివిక్రమ్ సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి మరి! మొత్తానికి అయితే పవన్ నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్ మూవీ ఉంటుందనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.

ఇక ఇటు పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.


Krishna

Krishna

Next Story