Pawan Kalyan Vakeel Saab: వకీల్ సాబ్ కోసం అప్పటివరకూ ఆగాల్సిందే!

Pawan Kalyan Vakeel Saab: రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.

Krishna
Updated on: 5 July 2020 9:54 PM IST
Pawan Kalyan Vakeel Saab: వకీల్ సాబ్ కోసం అప్పటివరకూ ఆగాల్సిందే!
X

Pawan Kalyan Vakeel Saab: రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

అయితే తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్నదానిపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం మిగిలిన 20 శాతం షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది షూటింగ్ ని కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలోకి వకీల్ సాబ్ ని దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా తమన్నా నటించనుందని ఆమెకి సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగలి ఉందని తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.


Krishna

Krishna

Next Story