Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్.. కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్ డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్.. కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్
Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్ డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించారు. తాజాగా సినిమా టీజర్‌తో పాటు టైటిల్‌ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. కింగ్ డమ్ అనే పేరును ఖరారు చేశారు. అయితే టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. యూబ్యూబ్‌లో 10 మిలియన్స్ వ్యూస్‌తో ప్రభంజనం సృష్టిస్తోంది.
ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో కింగ్ డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకుపోతోంది.
ఎన్టీఆర్ చెప్పిన మాటలతో టీజర్ మొదలవుతుంది. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలస పోయినా అలసిపోయినా.. ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు.. మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరి కోసం..? ఇంత బీభత్సం ఎవరి కోసం..? అసలీ వినాశనం ఎవరి కోసం..? రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రం బద్దలకొట్టి పునర్జనెత్తిన నాయకుడి కోసం.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన శక్తివంతమైన సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక చివర్లో విజయ్ దేవరకొండ చెప్పిన సంభాషణలు, ఆయన లుక్ చిత్రానికి అంతే ఆకర్షణగా నిలిచాయి.
హిందీ, తమిళంలో విడుదలైన టీజర్‌కి రణ్‌బీర్‌కపూర్, సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. వేసవి సందర్భంగా మే 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.