విజయ్‌ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ

యంగ్ హీరోగా విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్‌’.

Update: 2020-02-20 06:51 GMT
Vijay Movie

యంగ్ హీరోగా విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఫైటర్‌'. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో విజయ్‌ సరసన నటించేది ఎవరో చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండేను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత దివంగత హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌తో చిత్ర బృందం చర్చలు జరిపినప్పటికీ కుదరలేదు. దీంతో చివరికి అనన్య పాండేను ఎంపిక చేసింది.

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పూరి రూపొందిస్తున్నారు. ఇప్పటీకే ఈ సినిమాలో చేయబోయే స్టంట్స్ కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. 'ఫైటర్‌' సినిమా ముంబైలో ఇప్పటికే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది‌. అయితే, ఈ చిత్రంపై సెట్స్‌పైకి వెళ్లినా.. హీరోయిన్‌, ఇతర తారాగణం విషయంలో సినిమా యూనిట్‌ ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.

సినిమా సెట్‌లో ఇప్పటికే అనన్య పాండే అడుగుపెట్టింది. కాగా.. దీనికి సంబంధించిన ఓ ఫోటోలను కూడా చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనన్య పాండే ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాలో విలన్‌గా నటించిన చుంకీ పాండే కూమార్తె అనన్య పాండే.

ఇటీవలే విజయ్ నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' ఫలితం మాట ఆలా ఉంచితే. పూరీ డైరెక్షన్లో వచ్చే 'ఫైటర్‌'పైనే విజయ్‌ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత 'ఇస్మార్‌ శంకర్‌' హిట్‌తో పూరి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. 'ఫైటర్‌'తోనూ మరో సక్సెస్‌ కొట్టాలని పూరి అండ్‌ గ్యాంగ్‌ భావిస్తుంది. పూరీ సినిమాలు అంటే హీరో పాత్రను హైలెట్ చేసే విధంగా ఉంటయి. దీంతో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఓ రేంజ్ లో ఉంటుందని సినీవర్గాలు అంటున్నాయి. ఫైటర్ సినిమా విజయవంతం అయితే విజయ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అభిమానలు అంటోన్నారు.

  

Tags:    

Similar News