Nayanthara: వామ్మో..లేడీ సూపర్ స్టార్ పిల్లలు ఇంత పెద్దగా అయ్యారా? వైరల్ అవుతున్న పిక్స్

Update: 2025-05-30 12:05 GMT

Nayanthara: వామ్మో..లేడీ సూపర్ స్టార్ పిల్లలు ఇంత పెద్దగా అయ్యారా? వైరల్ అవుతున్న పిక్స్

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి అందరికీ తెలిసిందే. ఈ అమ్మడికి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న నయన్..ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.ఇద్దరు బాబులకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలాగ్ ధైవాన్ ఎన్.శివన్ అని పేర్లు పెట్టింది. నయనతార సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉంటారు. ఇద్దరు కూడా బుడిబుడి అడుగులు వేస్తూ నడుస్తున్న ఫొటోలు, వీడియోలను నయనతార గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా నయనతార..భర్త విఘ్నేష్ శివన్ తో ఉన్న రొమాంటిక్ ఫొటోలను మాత్రమే కాకుండా ఇద్దరు కొడుకులతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం సమ్మర్ హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న నయనతార ఫ్యామిలీ సరదాగా తీసుకున్న ఈ ఫొటోలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నాయి. నయన్, విఘ్నేష్ శివన్ దంపతుల కొడుకులు చూస్తుండగానే పెద్దగయ్యారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార తమిళనాట దక్కించుకున్న క్రేజే వేరు. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా పాపులార్టీని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. నయన దర్శకుడు విఘ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న మూవీకి కూడా సైన్ చేసింది. 

Tags:    

Similar News