స్పిరిట్‌లో వరుణ్ తేజ్ విలన్ అంటూ న్యూస్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ వంగా కాంబో రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా నుంచి అప్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
స్పిరిట్‌లో వరుణ్ తేజ్ విలన్ అంటూ న్యూస్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Varun Tej to Villain Role in Prabhas Spirit Movie: హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ వంగా కాంబోగా రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా నుంచి అప్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. సౌత్ కొరియా నటుడు డాంగ్ లీ విలన్‌గా నటించబోతున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీలో విలన్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం హిట్లు లేక సతమతమవుతున్నారు. గద్దలకొండ గణేష్ తర్వాత ఆయన నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయన విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కు వీరాభిమాని వరుణ్ తేజ్ అని చాలా సార్లు చెప్పుకున్నారు. ఈ శ్వర్ సినిమా టికెట్ బ్లాక్ లో కొని చూశానని అతనంటే అంత ఇష్టమని వరుణ్ ఓ ఈవెంట్‌లో చెప్పారు. అయితే స్పిరిట్ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తే బాగుంటుందని.. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్త చక్కర్లు కొడుతుంది. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పిరిట్ మేకర్స్ చెప్పినట్టు సమాచారం. వరుణ్ తేజ్ అనే డిస్కషన్ కూడా జరగలేదని అవన్నీ ఫేక్ అని కొట్టిపారేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటేదాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను సమ్మర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నారంట. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్‌ని ఇండోనేషియా రాజధాని జకార్తాలో చేయనున్నారని.. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మరోసారి అక్కడికి వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇండియాలోనే మొత్తం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఇక స్పిరిట్‌లో ప్రభాస్ మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి పోలీస్ ఆఫీసర్ అవుతారట. అంతేకాకుండా అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ప్రియురాలు, తండ్రి మీద హీరోకుండే విపరీతమైన ప్రేమను థీమ్‌గా తీసుకున్న సందీప్.. స్పిరిట్‌లో మాత్రం దానికి భిన్నంగా డ్యూటీ మీద హద్దులు దాటిన కమిట్మెంట్ ఎలా ఉంటుందో ప్రభాస్ పాత్రను అలా తీర్చిదిద్దారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా రష్మిక మందన్నా, కత్రినా కైఫ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కీలక పాత్రలో నటించనున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్పిరిట్ షూటింగ్ ను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనా స్పిరిట్ మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందనే అంచనాలున్నాయి.