ప్రభాస్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగ

Sandeep Vanga Gave Clarity on the Film With Prabhas
x

ప్రభాస్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగ

Highlights

Sandeep Vanga: "అర్జున్ రెడ్డి" సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా

Sandeep Vanga: "అర్జున్ రెడ్డి" సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. తాజాగా ఇప్పుడు రన్బీర్ కపూర్ హీరోగా "యానిమల్" అనే సినిమాతో బిజీగా ఉన్న సందీప్ త్వరలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి "స్పిరిట్" అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యానిమల్ సినిమా పూర్తవగానే ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని పట్టాలెక్కిస్తానని క్లారిటీ ఇచ్చారు సందీప్. ఇక భవిష్యత్తులో అయినా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు వెళ్లే అవకాశం ఉందా అని అడగగా, సినిమా విడుదల అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే అని అన్నారు. ఇక అభిమానులు తనని ఎలా చూడాలి అనుకుంటున్నారో స్పిరిట్ సినిమాలో సందీప్ వంగా తనని అలానే చూపించనున్నారు అని ప్రభాస్ ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలు ఎక్కుతుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లో కనిపించిన మూడు స్టార్లను చూసి ప్రభాస్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు మొదలు అయ్యాయి. సందీప్ వంగా తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ తో యువి క్రియేషన్స్ మరియు టి సిరీస్ వారితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories