Varalaxmi Sarathkumar: పెళ్లిరోజు కానుకగా హీరోయిన్‌కు కాస్లీంత కారు ఇచ్చిన భర్త.. ఖరీదు ఎంత ఉంటుందంటే?

Varalaxmi Sarathkumar: ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఓ రేంజ్‌లో చేసుకుంటారు. అయితే విచిత్రం ఏంటంటే ఓ రేంజ్‌లోనే విడిపోతుంటారు.

Update: 2025-07-22 14:16 GMT

Varalaxmi Sarathkumar: పెళ్లిరోజు కానుకగా హీరోయిన్‌కు కాస్లీంత కారు ఇచ్చిన భర్త.. ఖరీదు ఎంత ఉంటుందంటే?

Varalaxmi Sarathkumar: ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఓ రేంజ్‌లో చేసుకుంటారు. అయితే విచిత్రం ఏంటంటే ఓ రేంజ్‌లోనే విడిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం చాలా హ్యాపీగా మ్యారిటల్ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. ఇందులో ఈ మధ్య చేరిన వాళ్లు వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే తాజాగా ఆమె భర్త తనకు పెళ్లిరోజు కానుకగా చాలా ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఆ కారు వివరాలు తెలుసుకుందాం.

మొదటి నుంచీ పెళ్లి చేసుకోను అని చెప్పిన వరలక్ష్మీ శరత్ కుమార్ గత ఏడాది ప్రముఖ గ్యాలరీస్ట్ నికోలాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా మారిన వరలక్ష్మీకి తాజాగా భర్త నికోలాయ్ సర్ఫైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. మొదటి పెళ్లి రోజు కానుకగా ఒక పెద్ద, ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు.

ఈ కారు మోడల్ ఫోర్బ్స్ 718 బాక్స్‌స్టర్ మోడల్ పింక్ కలర్ కారును చూసి వరలక్ష్మీ ఎంతో ఆనందం అయిపోయింది.

అయితే దీని రేటు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ కారు ధర అక్షరాలా కోటి 60 లక్షలు. ఈ కాస్ట్లీ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు అయితే మొదటి పెళ్లికే ఇంత ఖరీదైన కారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ కారుకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ జంట కలకాలం హాయిగా కలిసి ఉండాలని కూడా నెటిజన్లు దీవించేస్తున్నారు.


Full View


Tags:    

Similar News