Varalakshmi Sarathkumar: హెల్మెట్ లాంటిదే వ్యాక్సిన్

Varalakshmi Sarathkumar: వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవద్దని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడొద్దని తెలిపారు.

Update: 2021-06-05 02:35 GMT

Varalakshmi Sarathkumar:(File Image)

Varalakshmi Sarathkumar: బండి మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎలా బయటపడతామో.. వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా నుంచి అలా బయటపడతాం. ఈ మాటలు డేరింగ్ బ్యూటీ వరలక్ష్మి చెప్పింది. తను వ్యాక్సిన్ ఫస్ట్ డోసు వేయించుకుని.. ఈ సందేశం ఇచ్చింది. వరలక్ష్మి ఏ పాత్ర వేసినా సరే.. హీరోయిన్లకన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో ఈ మధ్య జయమ్మగా అదరగొట్టింది. వరలక్ష్మి స్క్రీన్ మీద కనపడితే సీటీమారే అన్నట్లు పెరిగింది మేడమ్ క్రేజ్.

ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన 'క్రాక్‌' సిసినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది. దీంతో టాలీవుడ్ లో వరలక్ష్మి పేరు మారు మోగింది. ఈ సినిమాలో 'జయమ్మ' పాత్రలో నటించిన వరలక్ష్మి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇటీవల వరలక్ష్మి కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెప్పిన ఆమె.. మిగిలిన వారుకూడా తీసుకోవాలని అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు.

''వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడొద్దు. అందరికీ ఈ పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చినా.. అది నార్మలే. ఉదాహరణకు బైక్ మీద వెళ్లేవారు ప్రమాదాన్ని ఊహించలేరు. కానీ.. వారు హెల్మెట్ ధరించి ఉన్నట్టయితే.. ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. టీకా తీసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ.. కరోనా తీవ్రతను చాలా వరకు తగ్గిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎవరూ ఇప్పటి వరకు చనిపోలేదు. శరీరంలో మరేదైనా సమస్య ఉంటే.. దాని కారణంగా మరణించారు'' అని సూచించారు వరలక్ష్మి.

Tags:    

Similar News