Vakeel Saab: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకే ఫ్రేమ్‌లో పవన్, చిరు, రామ్ చరణ్
Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గ్రాండ్ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుంది.
Vakeel Saab: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకే ఫ్రేమ్‌లో పవన్, చిరు, రామ్ చరణ్
Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గ్రాండ్ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే పబ్లిసిటీ పీక్స్‌కు చేరుకుంది. దానికి తోడు ఏప్రిల్ 3న జరిగే వకీల్ సాబ్ మెగా ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా రాబోతుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు వకీల్ సాబ్‌పై టాలీవుడ్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే తమన్‌తో మ్యూజికల్ ప్రొగ్రామ్స్ కండక్ట్ చేసారు మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు.
ఇక ఏప్రిల్ 3న జరిగే మెగా ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరు, రామ్ చరణ్‌తో పాటు కోలీవుడ్ హీరో అజిత్ సహా దేశంలోని అన్ని ఇండస్ట్రీల నుంచీ బిగ్ సెలబ్రిటీలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు పవర్ స్టార్ కోసం టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో వకీల్ సాబ్ విడుదల కాకముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది అంటున్నారు మెగా ఫ్యాన్స్.