UV Creations : నిర్మాత వంశీ ఇంట్లో విషాదం
UV Creations : ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైనా నిర్మాత వంశీ ఇంట్లో విషాదం నెలకొంది.. అయన తండ్రి సోమవారం రాత్రి
UV Creations Producer vamshi father has passed away
UV Creations : ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైనా నిర్మాత వంశీ ఇంట్లో విషాదం నెలకొంది.. అయన తండ్రి సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.. వయసురిత్యా అయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో అయన సోమవారం రాత్రి మరణించారు. అయన మృతదేహాన్ని అయన స్వస్థలం అయిన నెల్లూరికి తరలించారు. దీనితో వంశీ ఇంట్లో విషాదం ఛాయలు అలుముకున్నాయి..
ఇక టాలీవుడ్ లో యువీ క్రియేషన్ సంస్థకి మంచి పేరుంది.. భారీ సినిమాలకి యువీ క్రియేషన్ సంస్థ పెట్టింది పేరు..యూవీ క్రియేషన్స్ నిర్మాతలుగా ప్రమోద్, వంశీ ఉన్నారు. వీరు ప్రభాస్ కి సినిమాల్లోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్.. హీరో ప్రభాస్ మిర్చి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సంస్థ.. కొరటాల శివ, సుజీత్, రాధాకృష్ణ లాంటి కొత్త దర్షకులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. ఇక ప్రభాస్ చిత్రాలను ఎక్కువగా యూవీ క్రియేషన్స్ నే నిర్మిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం యువీ క్రియేషన్స్ ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.