ప్రేమికుల రోజు స్పెషల్స్.. ఈ వారం థియేటర్, ఓటీటీ చిత్రాలు..
వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాలు థియేటర్, ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ ప్రేక్షకులను అలరించబోయే ఈ చిత్రాలేంటో చూద్దాం.
ప్రేమికుల రోజు స్పెషల్స్.. ఈ వారం థియేటర్, ఓటీటీ చిత్రాలు..
Upcoming Movies: వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాలు థియేటర్, ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ ప్రేక్షకులను అలరించబోయే ఈ చిత్రాలేంటో చూద్దాం.
విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. సాహూ గార్లపాటి నిర్మించారు. ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో విష్వక్ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాత్రలతో విష్వక్ సేన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.
నవ్వుల రారాజు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన సినిమా బ్రహ్మ ఆనందం. ఈ సినిమాకు ఆర్.వి.ఎస్. నిఖిల్ దర్శకత్వం వహించగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్‌లోకి రానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాతా, మనవళ్లుగా నటించారు. ఈ సినిమాలో మంచి కామెడీతో పాటు భావోద్వేగం నిండి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా థియేటర్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ డ్రామా సినిమా ఛావా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేశ్ విజన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శంభాజీ భార్య ఏసుభాయిగా రష్మిక కనిపించనున్నారు. పలు వివాదాల నడుమ విడుదలవుతున్న ఛావా సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీలా. 2020లో కరోనా టైంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ కథానాయికలుగా నటించారు. విభిన్న ప్రేమ కథతో ఆకట్టుకున్న ఈ సినిమా ఈ సారి ఇట్స్ కాంప్లికేటెడ్ అనే పేరుతో ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రాబోతుంది.
రణం సినిమాతో సత్తా చాటుకున్న దర్శకుడు అమ్మ రాజశేఖర్.. తాజాగా తల సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో తన కుమారుడు రాగిన్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అంకిత నస్కర్, ఎస్తేర్, అవినాష్, సత్యం రాజేశ్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ వారం ఓటీటీలో మరికొన్ని సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. నెట్ ఫ్లిక్స్: ధూమ్ ధామ్ (హిందీ) ఫిబ్రవరి 14న అలరించనుంది. బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్) ఫిబ్రవరి 10, కాదలిక్క నేరమిల్లై (తమిళ్) సినిమా ఫిబ్రవరి 11న రానున్నాయి. సోనీ లీవ్: మార్కో (తెలుగు) ఫిబ్రవరి 14 రానుంది. డిస్నీఫ్లస్ హాట్ స్టార్: బాబీ రిషి లవ్ స్టోరీ (హిందీ) ఫిబ్రవరి 11 అలరించనుంది. జీ5: ప్యార్ టెస్టింగ్ ( హిందీ) ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆహా: డ్యాన్స్ ఐకాన్ 2 (డ్యాన్స్ షో) ఫిబ్రవరి 14న రానుంది.