Upasana Funny Post: వాలంటైన్స్ డే వారికి కాదు.. ఉపాసన సరదా పోస్టు

వాలంటైన్స్ ‌డే. ఈ రోజును ప్రేమికులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Update: 2025-02-14 06:40 GMT

వాలంటైన్స్ డే వారికి కాదు.. ఉపాసన సరదా పోస్టు

Upasana Funny Post: వాలంటైన్స్ ‌డే. ఈ రోజును ప్రేమికులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ సరదా పోస్టును రామ్ చరణ్ సతీమణి ఉపాసన నెటిజన్లతో పంచుకున్నారు. ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు కలిగిన అమ్మాయిల కోసం. ఒకవేళ మీరు ఆ వయస్సును దాటిపోయి ఉంటే.. ఆంటీలు దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి అంటూ ఆ పోస్టులో రాసి ఉంది. ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా ఈ సరదా పోస్టును షేర్ చేసిన ఉపాసన ఒక స్మైలీ ఎమోజీని జోడించారు. ఇక ఈ పోస్టు ద్వారా ఉపాసన నవ్వులు పూయించారు.

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇటు మెగా కోడలిగా తన కుటుంబాన్ని.. అటు అపోల్స్ వైస్ చైర్మన్‌గా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఉపాసన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. తనవంతు సాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు ఉపాసన. ఇప్పటికే ఎంతోమందికి సేవలు అందించారు.

ఉపాసన ఇటీవల పిఠాపురంలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తాత, అపోలో ఆస్పత్రుల అధినేత, ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పించడం తమ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఉపాసన తెలిపారు.

ఇక రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇరుకుటుంబీకుల మధ్య వీరి వివాహం గ్రాండ్‌గా జరిపింది. పెళ్లైన దాదాపు పదకొండేళ్ల తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. ఈ మెగా ప్రిన్సెస్‌కు క్లింకార అని నామకరణం చేశారు. తరచూ ఉపాసన ఫ్యామిలీకి సంబంధించినవి వెకేషన్స్ పలు ఫొటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంటారు. అందులో క్లింకార ఫేస్ మాత్రం ఎమోజీలతో కవర్ చేస్తూ ఫొటోలు షేర్ చేస్తారు. దీంతో మెగా ఫ్యాన్స్ డిసపాయింట్‌ కామెంట్స్ చేస్తుంటారు. 



 


Tags:    

Similar News