పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి రెండు ఓటీటీల్లో భీమ్లా నాయక్‌..

Bheemla Nayak: "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా "భీమ్లా నాయక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Update: 2022-03-18 09:57 GMT

పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి రెండు ఓటీటీల్లో భీమ్లా నాయక్‌..

Bheemla Nayak: "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా "భీమ్లా నాయక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా రానా కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగులను అందించారు. నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైంది.

కాగా ఈ సినిమా అభిమానులకు చిత్ర బృందం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. మార్చి25న ఈ సినిమాను ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో రిలీజ్‌ చేయనున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు. కాగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు భీమ్లా నాయక్‌ సైతం ఓటీటీలో విడుదల కానుంది. 



Tags:    

Similar News