తాప్సి సినిమా రీమేక్ చేయనున్న త్రిష

Update: 2019-03-19 11:59 GMT

తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను గత కొంత కాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. మంచి హిట్స్ అందుకుంటూ అక్కడి స్టార్ హీరోలతో సైతం నటిస్తోంది తాప్సి. ఈ మధ్యనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి 'బద్లా' అనే సినిమా లో నటించింది తాప్సీ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. గతేడాది 'తుమ్హారి సులు' రీమేక్ తో హిట్ అందుకున్న నిర్మాత ధనుంజయ్ ఇప్పుడు ఈ సినిమా తెలుగులో తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ రీమేక్ వెర్షన్ కోసం తాప్సీని బదులు త్రిషను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలుగులో ఒక్క హిట్టు కూడా అందుకొని త్రిష తమిళంలో మాత్రం ఈ మధ్యనే '96' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఈమెకు తెలుగులో కూడా మార్కెట్ ఎక్కువగానే ఉన్నందు వల్ల తాప్సీని బదులు త్రిష ని హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక హత్య కేసులో ఇరుక్కున్న తాప్సీని రక్షించే లాయర్ గా మారతాడు అమితాబచ్చన్. కథలో కొన్ని ఊహించని మలుపులు హైలైట్ గా మారుతాయి. మరి ఈ చిత్రంతో త్రిష తెలుగులో హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

Similar News