Chava movie: ఛావా సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఇంతకు అతను ఎవరంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించి సినిమా ఛావా. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
ఛావా సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఇంతకు అతను ఎవరంటే..?
Chava movie: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించి సినిమా ఛావా. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింగ వైరల్ అవుతోంది. ఛావా సినిమాను టాలీవుడ్ స్టారో హీరో మిస్ చేసుకున్నారనే వార్త వినిపిస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరా అనేగా మీ సందేహం. అతను ఎవరో కాదు ప్రిన్స్ మహేష్ బాబు.
మరాఠా యోధుడు ఛత్రపతి మహరాజ్ శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కథను మొదట లక్ష్మణ్.. మహేష్ బాబుకు వినిపించారని టాక్ నడుస్తోంది. కానీ మహేష్ ఈ సినిమా చేయడానికి అంత ఆసక్తి చూపలేదట. దీంతో కొంతకాలం తర్వాత ఈ కథను విక్కీ కౌశల్‌కు వినిపించారట డైరెక్టర్.. కథ నచ్చడంతో ఒకే చెప్పేశారంట విక్కీ. అలా మహేష్ ఈ సినిమాను మిస్ చేసుకున్నాని టాక్.
అలాగే మొదట ఛావా సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను అనుకోగా ఆమె కూడా నో చెప్పడంతో రష్మికను ఓకే చేసినట్టు సమాచారం. ఈ మూవీలో రష్మిక ఏసుబాయిగా కనిపించారు. ఇక ఈ పాత్రలో రష్మిక ఒదిగిపోయారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ అద్భుతంగా నటించారంటూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌ను కంటతడి పెట్టించాయి. అంతలా మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ సినిమాలో విక్కీ పాత్రకు ఆడియన్స్ వందకు వంద మార్కులు వేశారు. అలా సూపర్ స్టార్ చేయాల్సిన మూవీ.. బాలీవుడ్ హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. మహేష్ కనుక ఈ సినిమాను చేసి ఉంటే పాన్ ఇండియా స్టార్‌గా ఓ రేంజ్‌లో స్టార్ డమ్ సంపాదించుకునేవారు అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై దినేష్ విజయన్ నిర్మించారు. ఈ మూవీలో అక్షయ్ కన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఛావా భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి వీకెండ్‌లోనే రూ.100 కోట్లు దాటడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.