Producer Ashwini Dutt : అప్పటివరకూ ధియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు : అశ్వినీదత్‌

Producer Ashwini Dutt : కరోనాని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం వల్ల సినిమా ఇండస్ట్రీ బాగానే నష్టపోయిందని చెప్పాలి..

Update: 2020-08-28 05:45 GMT

Ashwini dutt

Producer Ashwini Dutt : కరోనాని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం వల్ల సినిమా ఇండస్ట్రీ బాగానే నష్టపోయిందని చెప్పాలి.. షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు బంద్ కావడంతో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూసింది.. తాజాగా కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో గైడ్ లైన్స్ ఆధారంగా బుల్లితెర, వెండితెరకి సంబంధించిన షూటింగ్ లు మళ్ళీ పట్టాలేక్కుతున్నాయి. ఇక ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, నవీన్ చంద్ర భానుమతి & రామకృష్ణ మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి.

అయితే తాజాగా తమిళ్ హీరో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాని ప్రస్తుత పరిస్థితి దృష్టి ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.. అక్టోబర్‌ 30న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.. అయితే సూర్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్‌ దర్శకుడు హరి అతడికి లేఖ రాయడం కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకి దారి తీసింది.. అయితే సూర్య నిర్ణయాన్ని వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ సమర్థించారు. ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి వరకు ధియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని అయన వాఖ్యానించారు.. చేసిన సినిమాలను అందరూ థియేటర్లలోనే చూడండి అంటూ ప్రజల ఆరోగ్యాలతో, వారి ప్రాణాలతో ఆటలాడటం చాలా తప్పు. ఇంట్లో క్షేమంగా ఉంటూ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునేవాళ్లందరికీ ఓటీటీ మంచి మార్గమని అన్నారు..

అందులో భాగంగా హీరో సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాల్సిందిగా దర్శకుడు హరిని కోరుతున్నట్లుగా వెల్లడించాలని అయన కోరారు.. ఇక వాస్తవ పరిస్థితి దృష్ట్యా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అయన వెల్లడించారు.. ఇక హీరోలు నాని, సుదీర్ బాబు నటించిన v చిత్రం కూడా సెప్టెంబర్ 05 న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది..  

Tags:    

Similar News