April Release Movies: ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..
April Release Movies:గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా సినిమాలు విడుదలకు బ్రేక్ పడింది.
April Release Movies
April Release Movies: గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా సినిమాలు విడుదలకు బ్రేక్ పడింది. ఇక ఈ ఏడాది పరిస్థితులు కుదుటపడటంతో మళ్లి సినిమాలు రిలీజ్‌లు ఊపందుకున్నాయి. చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ లు ప్రకటించుకున్నాయి. మెజార్టీ చిత్రాలు అనుకున్న తేదీకే వచ్చినా.. కొన్ని చిత్రాలు వాయిదా పడ్డాయి. వాటిలో ఒకటి గోపిచండ్ నటించిన సీటీమార్. ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపద్యంలో ఏప్రిల్ మాసంలో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.
ఏప్రిల్ నెలలో పలు చిత్రాలు టాలీవుడ్‌లో విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' పై ఎన్నో అంచనాలున్నాయి. మరోవైపు నాగార్జున.. 'వైల్డ్ డాగ్', నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల... 'లవ్ స్టోరీ'తో'విరాట పర్వం' సినిమాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1న కన్నడ పవర్ స్టార్ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ 'యువరత్న' సినిమా విడుదల కానుంది. ఏప్రిల్ 2 కార్తి హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ 'సుల్తాన్', ఏప్రిల్ 16న 'కనబడుటలేదు' మూవీ రిలీజ్ కానుంది.
*ఏప్రిల్ 1 'యువరత్న'
*ఏప్రిల్ 2న 'వైల్డ్ డాగ్'
*ఏప్రిల్ 2 'సుల్తాన్'
*ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్'
*ఏప్రిల్ 16న 'లవ్ స్టోరీ'
*ఏప్రిల్ 16న 'కనబడుటలేదు'
*ఏప్రిల్ 23న 'టక్ జగదీష్'
*ఏప్రిల్ 23న 'శుక్ర'
*ఏప్రిల్ 30న 'సీటీమార్'
*ఏప్రిల్ 30న 'విరాట పర్వం'