బాలీవుడ్ లోకి ప్రణీత!

ప్రణీత గుర్తుందా? కన్నడ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. కొన్ని హిట్ సినిమాల్లో కూడా చేసింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేదీ లో మెరిసింది.

Update: 2019-08-19 06:56 GMT

ప్రణీత గుర్తుందా? కన్నడ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. కొన్ని హిట్ సినిమాల్లో కూడా చేసింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేదీ లో మెరిసింది. అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించే ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న 'భుజ్ - ద ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో తాను నాయికగా నటిస్తున్నట్టు వెల్లడించింది. ఈ సినిమాలో తాను అజయ్ కు భార్యగా సంప్రదాయ రీతిలో కనిపిస్తానని ప్రణీత చెప్పింది. సో, ప్రణీత పద్దతిగా బాలీవుడ్ లో కనిపించనుందన్న మాట.


Tags:    

Similar News