K Vasu: టాలీవుడ్‌లో మరో విషాదం.. డైరెక్టర్ కె.వాసు కన్నుమూత

K Vasu: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కే. వాసు

Update: 2023-05-26 13:22 GMT
Tollywood Director K Vasu Passed Away

K Vasu: టాలీవుడ్‌లో మరో విషాదం.. డైరెక్టర్ కె.వాసు కన్నుమూత

  • whatsapp icon

K Vasu: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా ఇటీవల ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందగా.. తాజాగా సీనియర్ దర్శకుడు కే. వాసు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా, కే. వాసు మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలిచిత్రం ప్రాణం ఖరీదు చిత్రానికి కే. వాసు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా అమెరికా అల్లుడు, శ్రీషిరిడీ సాయిబాబా మహత్యం, ఇంట్లో శ్రీమతి వీధిలోకుమారి, అల్లుళ్లొస్తున్నారు వంటి పలు హిట్ చిత్రాలకు కే. వాసు దర్శకుడిగా పనిచేశారు.

Tags:    

Similar News