క్రిస్మస్‌ సినిమాల తొలిరోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద రోషన్ 'ఛాంపియన్' రికార్డు.. ఆది సాయికుమార్ 'శంబాల' జోరు!

Update: 2025-12-26 09:52 GMT

క్రిస్మస్ కానుకగా విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. యాక్షన్, సస్పెన్స్, హారర్ జానర్‌లలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.

1. రోషన్ - 'ఛాంపియన్' 

శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని అందుకుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

తొలిరోజు వసూళ్లు: రూ. 4.50 కోట్లు

2. ఆది సాయికుమార్ - 'శంబాల

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్‌కు 'శంబాల' మంచి ఊపిరినిచ్చింది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ హైప్‌ను నిలబెట్టుకుంటూ మంచి ఓపెనింగ్స్ సాధించింది.

తొలిరోజు వసూళ్లు: రూ. 3.3 కోట్లు

3. 'ఈషా'

ప్రముఖ నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి నిర్మించిన హారర్ థ్రిల్లర్ 'ఈషా' ప్రేక్షకులను భయపెట్టడంలో విజయవంతమైంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్‌లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

తొలిరోజు వసూళ్లు: రూ. 2.18 కోట్లు

Tags:    

Similar News