పవన్ Vs చరణ్.. ఇదెక్కడి ట్విస్ట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది.
పవన్ Vs చరణ్.. ఇదెక్కడి ట్విస్ట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. అయితే ఆ మార్చి నెల ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ సినిమాలతో నిండిపోయింది. దీంతో ఈ మూడు పెద్ద సినిమాల మధ్య భారీ పోటీ తప్పదు.
దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలు సృష్టించింది. కానీ మార్చి 26న రామ్ చరణ్ పెద్ది, మార్చి 27న నాని ది ప్యారడైజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి నెలలో ముఖాముఖీగా వస్తున్న ఈ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను భారీ స్థాయిలో కుదిపేయనున్నాయి. మార్చి నెలలో ఈ మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అనేది ఆసక్తికరంగా మారింది.