ఆ బయోపిక్ లో సమంత.. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్
తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది సమంత..
తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది సమంత.. అందరూ స్టార్ హీరోలతో కలసి నటించింది. ఇక అక్కినేని నాగచైతన్య తో పెళ్లి అనంతరం మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది సమంత... ఇప్పటికే మహానటి, యూ టర్న్, ఓ బేబీ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది సమంత.. ప్రస్తుతం మరో శక్తివంతమైన మహిళా పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించ బోయే బయోపిక్ లో సమంత ప్రధాన పాత్ర పోషించనుందని తెలుస్తోంది..
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవిత నేపథ్యం ఆధారంగా సింగీతం శ్రీనివాసరావు ఆమె బయోపిక్ నీ తెరకెక్కిస్తున్నాడని సమాచారం... అయితే ముందుగా ఇందులో ప్రధాన పాత్రగా అనుష్కని అనుకున్నారట.. కానీ ఏమైందో తెలియదుకు ఇప్పుడు ఈ బయోపిక్‌లో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. నాగరత్నమ్మ.. దేవదాసిగా పుట్టి సంగీత కళాకారిణిగా ఎదిగి జీవిత చరమాంకంలో యోగినిగా మారింది. తన సంపదనంతా కళలకు, కళాకారులకు ధారపోసింది.
ఆమె పాత్రని ఛాలెంజ్‌గా తీసుకొని సమంత చేయనుందని తెలుస్తోంది. దీనిపైన త్వరలో క్లారిటీ రానుంది. ఇటీవలే 'జాను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ '96'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సమంత ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తోంది.