Manchu Lakshmi Comments on Hyderabad Police: కంటికి కనిపించే ప్రత్యక్షమైన దైవాలు మీరే... పోలిసులపై మంచు లక్ష్మి!

Manchu Lakshmi Comments on Hyderabad Police: దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే..

Update: 2020-07-19 11:00 GMT
Manchu Lakshmi

Manchu Lakshmi Comments on Hyderabad Police: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసుల ప్రతిభ వెలకట్టలేనిది. తమకి ఫ్యామిలీ ఉన్న సరే.. తమ ఆరోగ్యం, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా ఎదురుకున్నారు. ఇక పలుచోట్లల్లో లాక్ డౌన్ నిబంధనలను పక్కన పెట్టి మరి బయటకి వచ్చిన వారికి కరోనా పై అవగాహన కల్పిస్తూ బయటకు రావొద్దని సూచనలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కరోనా బారిన పడ్డారు.

అయితే తాజాగా ఇదే అంశం పైన నటీ మంచు లక్ష్మి మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలిసులందరికి సెల్యూట్ ..లాక్ డౌన్ సమయంలో మీరు పడ్డ శ్రమను మేము చూసాము. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 98 మంది పోలీసులు కరోనా బారిన పడి కోలుకున్నారని తెలిసింది. నిజంగా ఇది సంతోషించాల్సిన విషయం అని అన్నారు మంచు లక్ష్మి.. హనుమాన్, రాముడు, కృష్ణుడు గురించి ఇంతవరకూ పుస్తకాల్లోనే చదివాం కానీ కంటికి కనిపించే ప్రత్యక్షమైన దైవాలు మీరేనంటూ పోలిసుల పైన ప్రశంసలు గుప్పించారు మంచు లక్ష్మి..

ఇక అతి తవరలో మనమంతా కలుసుకోవాలని కోరుకుంటునట్టుగా ఆ వీడియోలో పేర్కొంది మంచు లక్ష్మి.. ఇక ఆమె వీడియో పైన హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ''పోలీసుల కష్టాన్ని మంచు లక్ష్మి గుర్తించారు'' అని పోస్ట్ చేశారు. ఇక నెటిజన్లు కూడా ఈ వీడియో పైన తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక అటు తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. శనివారం (జూలై 18) వరకు ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో 1284 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 43,780కి చేరింది.


Full View


Tags:    

Similar News