ఓటు వేయకపోవడం పెద్ద నేరం : రాజేంద్రప్రసాద్

. ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం ఎవరు లేకా బోసిపోవడం చూసి తన మనసు చలించిపోయిందని అయన అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Update: 2020-12-01 10:37 GMT

గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు సినీ నటుడు రాజేంద్రప్రసాద్. . కేపీహెచ్‌ ఏడో ఫేజ్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 58లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు రాజేంద్రప్రసాద్. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని అన్నారు. రేపు అభివృద్ధి విషయంలో ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నా ప్రతి ఒక్కరు ఓటు హక్కను వినియోగించుకోవాలని అన్నారు.

ఓటు వేయకపోవడం పెద్ద నేరమని అన్నారు. ప్రస్తుతం తాను అరకులో షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ఓటు వేసేందుకే హైదరాబాద్‌కు వచ్చినట్టుగా వెల్లడించారు. ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం ఎవరు లేకా బోసిపోవడం చూసి తన మనసు చలించిపోయిందని అయన అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అటు మధ్యాహ్నం 01 వరకు 18 శాతం ఓటింగ్ నమోదు అయింది.

Tags:    

Similar News