Richest Actor: ఇండియాలో రిచ్ స్టార్‌లో తెలుగు హీరో.. అతని ఆస్తి ఎన్ని కోట్లంటే..?

Richest Actor: ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్‌ అన్నింటిలో ముందుండే వారు. సినిమాలు, రెమ్యూనరేషన్‌లో వారిదే పై చేయి ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డులన్నింటిని మన టాలీవుడ్ హీరోలు తుడిచిపెట్టేస్తున్నారు.

Update: 2025-02-06 06:26 GMT

ఇండియాలో రిచ్ స్టార్‌లో తెలుగు హీరో.. అతని ఆస్తి ఎన్ని కోట్లంటే..?

Richest Actor: ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్‌ అన్నింటిలో ముందుండే వారు. సినిమాలు, రెమ్యూనరేషన్‌లో వారిదే పై చేయి ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డులన్నింటిని మన టాలీవుడ్ హీరోలు తుడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగత సంపదలోనూ బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవట్లేదు. ఇంతకీ మన ఇండియాలో రిచ్ స్టార్‌‌‌లలో ఒకరిగా నిలిచిన టాలీవుడ్ హీరో ఎవరా అనుకుంటున్నారా..? ఇంతకీ ఆయన ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున. ఈ విషయాన్ని మనీ కంట్రోల్ అనే ఆర్థిక వ్యవహారాల సంస్థ తాజాగా వెల్లడించింది. ఇంతకీ ఆయన ఆస్తి ఎన్ని కోట్లో చూద్దాం.

మనీ కంట్రోల్ సంస్థ ప్రకారం.. నాగార్జున నికర ఆస్తుల విలువ రూ.3,572 కోట్లకు పైనే. దీని ద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు నాగార్జున. నాగార్జున కంటే ముందున్న వారిలో షారూఖ్ ఖాన్ రూ.7,300 కోట్లు, జుహీ చావ్లా రూ.4,600 కోట్లు. ఇక అమితాబ్ బచ్చన్ ఆస్తి విలువ రూ.3,200 కోట్లు కాగా, హృతిక్ రోషన్ ఆస్తి రూ.3,100 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.2900 కోట్లు, అక్షయ్ కుమార్ రూ.2700 కోట్లు, అమీర్ ఖాన్ రూ.1900 కోట్లు కలిగి ఉన్నారు. వీరందరి కంటే టాలీవుడ్ హీరో నాగార్జున ముందున్నారు.

దక్షిణాదికి చెందిన సినీ పరిశ్రమలో నాగార్జున ముందుండగా.. నాగార్జున తర్వాత ప్లేస్‌లో చిరంజీవి నిలిచారు. చిరంజీవి నికర ఆస్తుల విలువ రూ.1650 కోట్లు. తర్వాత రామ్ చరణ్ రూ.1370 కోట్లు, కమల్ హాసన్ రూ.600 కోట్లు, రజనీకాంత్ రూ.500 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ రూ.500 కోట్లు, ప్రభాస్ రూ.250 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే నాగార్జున రిచ్ స్టార్ కావడానికి కారణం తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు వ్యాపారాల ద్వారా టాప్ ప్లేస్‌లో నిలిచారని మనీ కంట్రోల్ వెల్లడించింది.

నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా, స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడుటు పెట్టడం వల్ల రిచ్ స్టార్‌ అయ్యారు. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప అధికారికంగా ధృవీకరించినవి కావనే విషయాన్ని గమనించాలి.

Tags:    

Similar News